ది ప్యారడైజ్ వాయిదాపై క్లారిటీ.. పవర్‌ఫుల్‌గా విక్రమ్ మాలిక్ పోస్టర్

by Chukka Sudharani |   (  Updated:2026-06-19 15:45:25  IST  )

‘దసరా’తో బ్లాక్ బస్టర్ మిట్ అందుకున్న తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కొలాబిరేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’.

ది ప్యారడైజ్ వాయిదాపై క్లారిటీ.. పవర్‌ఫుల్‌గా విక్రమ్ మాలిక్ పోస్టర్
X

దిశ, సినిమా: ‘దసరా’తో బ్లాక్ బస్టర్ మిట్ అందుకున్న తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కొలాబిరేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్టు నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నాని జడళ్ అనే పాత్రలో కనిపిస్తుండగా.. సికంజా మాలిక్ అనే పాత్రలో మోహన్ బాబు నటిస్తు్న్నారు. ఇక ఆయన కుమారుడుగా విలన్ పాత్రలో రాఘవ్ జూయెల్ ‘విక్రమ్ మాలిక్’గా నటిస్తున్నట్లు తెలుపుతూ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. విడుదల చేసిన పోస్టర్‌లో మెడలో కిలోల కొద్ది నగలతో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. కాగా.. కయాదు లోహార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు విడుదల చేసిన విలన్ పాత్రలో రిలీజ్ డేట్ లేకపోవడంతో.. గత కొద్ది రోజులుగా ది ప్యారడైజ్ వాయిదా పడుతున్నట్లు వార్తలే నిజం అంటూ ఓ క్లారిటీకి వచ్చేశారు నెటిజన్లు.

Next Story