మొత్తంగా మారిన రవితేజ ప్లాన్.. 'ఇరుముడి' రిలీజ్ వరకు నో కాంప్రమైజ్

by Pulgam srinivas |

ప్రస్తుతం రవితేజ పూర్తిగా 'ఇరుముడి' సినిమాపైనే దృష్టి సారించి, కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని సమాచారం.

మొత్తంగా మారిన రవితేజ ప్లాన్.. ఇరుముడి రిలీజ్ వరకు నో కాంప్రమైజ్
X

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ ఎప్పుడూ వరుస సినిమాలతో బిజీగా ఉండే హీరోల్లో ఒకరు. సాధారణంగా ఆయన ఒకేసారి రెండు, మూడు సినిమాల షూటింగ్‌లలో పాల్గొనడంతో పాటు, కొత్త ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తుంటారు. అయితే ఇటీవల ఆయన ప్లాన్‌లో కొంత మార్పు వచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.గత కొంతకాలంగా రవితేజ నటించిన పలు సినిమాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోవడంతో, ఈసారి ఆయన మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ పూర్తిగా 'ఇరుముడి' సినిమాపైనే దృష్టి సారించినట్లు సమాచారం.

ఇటీవల పలువురు దర్శకులు కథలు వినిపించినప్పటికీ, ఆయన ఏ ప్రాజెక్ట్‌కూ ఇప్పటివరకు ఓకే చెప్పలేదని టాక్ వినిపిస్తోంది.'ఇరుముడి' సినిమా విడుదలైన తర్వాతే కొత్త సినిమాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని రవితేజ భావిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియ భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రవితేజ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. మరి 'ఇరుముడి'తో రవితేజ ఘన విజయాన్ని అందుకుని సూపర్ కమ్‌బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.

Next Story