Nagabandham Trailer: సస్పెన్సింగ్‌గా ‘నాగబంధం’ ట్రైలర్..

by Chukka Sudharani |   (  Updated:2026-06-19 15:47:08  IST  )

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ నుండి వస్తున్న మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘నాగబంధం’.

Nagabandham Trailer:  సస్పెన్సింగ్‌గా ‘నాగబంధం’ ట్రైలర్..
X

దిశ, సినిమా: వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ నుండి వస్తున్న మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘నాగబంధం’. యువ నటుడు విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్‌ను చూస్తే.. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోని స్వర్ణపుష్పం దక్కించుకునేందుకు కొందరు విలన్స్ ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయాణంలో హీరో వాళ్లకు సహాయపడాల్సి వస్తుంది. తర్వాత ఏమైంది? అసలు హిమాలయాల్లో ఉండే నాగసాధువులు ఎందుకు వచ్చారు? లాంటి అంశాలను చాలా సస్పెన్స్‌గా కట్ చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు మేకర్స్. యాక్షన్, రక్తపాతం, ప్రతి ఫ్రేమ్‌లో గంభీరం ఇవన్ని సినిమాను నెక్ట్స్ లెవల్‌‌లో ప్రజెంట్ చేస్తున్నాయి. నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య జులై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. కాగా.. మైథలాజికల్ టచ్‌తో కూడిన అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పురాతన దేవాలయాల్లోని రహస్యాలు, వాటిని కాపాడే శక్తుల నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ డ్రామా ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లనుందట. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.

Next Story