- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియుడితో కలిసి కుమారుడి హత్య..!
జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు హరికృష్ణ మృతి కేసు సంచలన మలుపు తిరిగింది.

దిశ, జగదేవపూర్ : జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు హరికృష్ణ మృతి కేసు సంచలన మలుపు తిరిగింది. ఫిట్స్ కారణంగా బాలుడు మరణించాడని చెప్పిన తల్లి, అనంతరం తన ప్రియుడితో కలిసి బాలుడిని హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జగదేవపూర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తీగుల్ గ్రామానికి చెందిన స్వామి, జ్యోతి దంపతులు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసరలో నివసిస్తున్నారు. ఈ ఏడాది మే 30వ తేదీన తమ మూడేళ్ల కుమారుడు హరికృష్ణ ఫిట్స్ కారణంగా మరణించాడని జ్యోతి తన భర్త స్వామికి తెలిపింది. భార్య చెప్పిన మాటలను నమ్మిన స్వామి, బాలుడి మృతదేహాన్ని జగదేవపూర్ మండలం తీగుల్ కు తీసుకువచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే, బాలుడి మరణం పై అనుమానం వ్యక్తం చేసిన స్వామి, కుటుంబ సభ్యులతో కలిసి జ్యోతిని నిలదీశాడు. ఈ క్రమంలో జ్యోతి, తన ప్రియుడు నవీన్‌తో కలిసి కీసరలోని తమ నివాసంలో హరికృష్ణను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో బాలుడి తండ్రి స్వామి శుక్రవారం కీసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు విచారణలో భాగంగా కీసర పోలీసులు, వైద్యుల బృందం శుక్రవారం తీగుల్ గ్రామానికి చేరుకుని, అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశంలో బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి, మృతికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు నమూనాలను సేకరించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి విచారణ చేపట్టి, నిందితుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.






