- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హయత్నగర్ కొత్త సీఐగా సీహెచ్ శంకరయ్య
by Taduka Kalyani |
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో గా సీహెచ్. శంకరయ్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.

X
దిశ, వనస్థలిపురం: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో గా సీహెచ్. శంకరయ్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ పల్స నాగరాజ్ గౌడ్ ను మల్కాజ్గిరి సీపీకి అటాచ్ చేయగా.. ఆ స్థానంలో శంకరయ్యను నియమించారు. ఈ సందర్భంగా సీఐ శంకరయ్య మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో శక్తి వంచన లేకుండా పనిచేస్తానని, హయత్ నగర్ ప్రజలు సహకరించాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్ కట్టడిలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదన్నారు. బాధ్యతలు స్వీకరించిన సీఐకు ఎస్‌ఐలు , సిబ్బంది అభినందనలు తెలిపారు
Next Story






