లంచంపై Acb ట్రాప్.. అడ్డంగా బుక్కైన జూనియర్ అసిస్టెంట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-19 14:02:21  IST  )

విశాఖలో ఏసీబీ అధికారుల దాడి కలకలం సృష్టించింది. లంచం డిమాండ్ చేసిన అధికారిని పక్కా స్కెచ్‌తో అధికారులు పట్టుకున్నారు. ఆకస్మిక దాడులతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జోన్ కార్యాలయంలో అధికారులందరినీ హడలెత్తించారు..

లంచంపై Acb ట్రాప్.. అడ్డంగా బుక్కైన జూనియర్ అసిస్టెంట్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో ఏసీబీ అధికారుల(ACB officials) దాడి కలకలం సృష్టించింది. లంచం(Bribe) డిమాండ్ చేసిన అధికారిని పక్కా స్కెచ్‌తో అధికారులు పట్టుకున్నారు. ఆకస్మిక దాడులతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జోన్ కార్యాలయం(Visakhapatnam Municipal Corporation Zone Office)లో అధికారులందరినీ హడలెత్తించారు. మరోసారి లంచం మాటే వినిపించుకుండా చర్యలు చేపట్టారు.

డెత్ సర్టిఫికెట్ కోసం...

కాగా తమ బంధువు డెత్ సర్టిఫికెట్ కోసం ఓ వ్యక్తి విశాఖఎన్ఏడీ కొత్త రోడ్డులోని జీవీఎంపీ జోనల్ కార్యాలయానికి వెళ్లారు. జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌ను కలిశారు. తమ బంధువు డెత్ సర్టిఫికేట్ అడిగారు. అయితే తనకు రూ. 30 వేలు లంచం ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లంచం ఇచ్చుకోలేని బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించారు. దీంతో పథకం ప్రకారం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ బాగోతంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు

Next Story