కేజీబీవీ లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

by velandi.Saikiran |

కేజీబీవీలో 2026–27 విద్యా సంవత్సరానికి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి పద్మ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

కేజీబీవీ లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, గొల్లపల్లి: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి పద్మ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేజీబీవీ అప్‌గ్రేడేషన్‌లో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ సీఈసీ కోర్సును నూతనంగా ప్రారంభిస్తున్న నేపథ్యంలో కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ)తో పాటు బి.ఎడ్ ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. అర్హత, అనుభవం కలిగిన మహిళా అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు అటెస్టెడ్ జిరాక్స్ ప్రతులను జతచేసి జూన్ 20 నుంచి 22వ తేదీ వరకు గొల్లపల్లి కేజీబీవీ కార్యాలయంలో నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Next Story