జగిత్యాలలో అరుదైన శస్త్ర చికిత్స

by velandi.Saikiran |

శ్రీకర ఆసుపత్రిలో అరుదైన చికిత్సను శుక్రవారం వైద్యులు విజయవంతంగా నిర్వహించారు.

జగిత్యాలలో అరుదైన శస్త్ర చికిత్స
X

దిశ, జగిత్యాల టౌన్: జిల్లా కేంద్రంలోని శ్రీకర ఆసుపత్రిలో అరుదైన చికిత్సను శుక్రవారం వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ధర్మపురి పట్టణానికి చెందిన ఓ మహిళ తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రిలో చికిత్స కోసం అడ్మిట్ అయింది. ఈ త‌రుణంలోనే పరీక్షలు చేసి కడుపులో ఏడు కిలోలకు పైగా కణతి ఉందని డాక్టర్లు నిర్ధారించారు. అనంతరం డా.శ్రీకాంత్, నాగమణి సర్జరీ చేసి కణతిని తొలగించారు. ఇంత పెద్ద పరిమాణంలో కణతులు చాలా అరుదుగా ఉంటాయని సదరు వైద్యులు పేర్కొన్నారు.

Next Story