Yogandhra : యోగాంధ్రకు అనూహ్య స్పందన.. లక్ష్యాన్ని మించి రిజిస్ట్రేషన్లు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-19 15:54:08  IST  )

Yogandhra : యోగాంధ్రకు అనూహ్య స్పందన.. లక్ష్యాన్ని మించి రిజిస్ట్రేషన్లు
X

దిశ‌, ఏపీ బ్యూరో: యోగాంధ్ర-2026 రిజిస్ట్రేషన్లు లక్ష్యానికి మించి నమోదు అయ్యాయి. 1,04,93,947 లక్ష్యం కాగా శుక్రవారం సాయంత్రం నాటికి 1,06,50,502 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 28కి 23 జిల్లాల్లో నూరు శాతానికి మించి రిజిస్ట్రేషన్లు జరిగినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు, కడప జిల్లాలు పౌరుల రిజిస్ట్రేషన్ లో 100% నమోదుకు చేరువలో ఉన్నాయని ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ వెల్లడించారు.

మార్కాపురం జిల్లాలో అత్యధికం

కాగా ఈ నెల 21న రాష్ట్రంలోని 28 జిల్లాల్లో జరిగే యోగాసన కార్యక్రమాల్లో 1,04,93,947 మందిని భాగస్వాములను చేయడాన్ని జిల్లాల్లోని జ‌నభా ప్రాతిప‌దిక‌న ల‌క్ష్యాన్ని ప్రభుత్వం జిల్లాల అధికారులకు లక్ష్యాలను నిర్దేశించింది. దీనికి అనుగుణంగా యోగాంధ్ర పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఆదివారంతో రిజిస్ట్రేషన్ల నమోదు పూర్తి కానున్న నేపథ్యంలో ముందుగానే లక్ష్యానికి మించి జరిగాయి. మార్కాపురం జిల్లాలో అత్యధికంగా 112.96% రిజిస్ట్రేషన్ జరిగాయి.

Next Story