- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి : ఎమ్మెల్యే మాణిక్ రావు
నిధుల కొరత లేకుండా నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే మాణిక్ రావు హామీ ఇచ్చారు.

దిశ, జహీరాబాద్ : నిధుల కొరత లేకుండా నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే మాణిక్ రావు హామీ ఇచ్చారు. మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. జహీరాబాద్ మండలం హోతి(బి) పంచాయతీ సర్పంచ్ మచ్చేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ.20 లక్షల సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులను వారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు గ్రామానికి గుర్తింపునిస్తాయన్నారు.
అంతర్గత రోడ్డు, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పనులు నిర్వహించాలని సూచించారు. వర్షాకాలంలో ప్రజలు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా ఈ పనులను పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ ఝరాసంఘం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, సర్పంచులు రాజు సత్వార్, చేస్మొద్దీన్ శేఖపూర్, మోహన్ రాథోడ్ శేఖపూర్ తాండ, శ్రీనివాస్ బూచినెల్లి, అరుణ్ కుమార్ కొత్తూరు, వెంకట్ గోవింద్ పూర్, భీం రావ్ హుగ్గెల్లి తాండ, మాజీ సర్పంచులు చిన్నారెడ్డి , అమీత్ కుమార్, రాజు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పర్వేజ్ పటేల్ హోతి (బి), గ్రామ వార్డ్ మెంబర్ లు, ప్రజలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






