కాంగ్రెస్ ఫస్టాప్ పాలన అట్టర్ ఫ్లాప్

by velandi.Saikiran |

అడ్డగోలు మాటలు.. నోటికొచ్చిన హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కల్వకుంట్ల తారకరామరావు ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ ఫస్టాప్ పాలన అట్టర్ ఫ్లాప్
X

దిశ, మేడ్చల్ బ్యూరో/అల్వాల్: అడ్డగోలు మాటలు.. నోటికొచ్చిన హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామరావు ఫైర్ అయ్యారు. 100 రోజుల్లోనే ఇచ్చిన 420 హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, 900 రోజులు అయినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ ,బీజేపీలను నమ్మలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. శుక్రవారం బొల్లారంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మల్కాజిగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో సర్ పై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పి, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలో వచ్చారని ఫైర్ అయ్యారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏళ్లు గడుస్తున్న ఇచ్చిన గ్యారంటీల ఊసే లేదన్నారు. దీనిపై ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే అడ్డమైన తిట్లు తిడుతున్నారని,వంద రోజుల్లో పిల్లలు పుడుతారా అంటూ వింత మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తిడుతూ పాలన గాలికి వదిలేశారని, ప్రభుత్వాన్ని కేటీఆర్ ఓ మాఫియాతో పోల్చారు. గత ప్రభతువం చేసిన పనులకు రిబ్బన్లు కట్ చేసేందుకు సిఎం తన జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలోనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

అభివృద్ది శూన్యం.. అప్పులే పెరిగాయి..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది శూన్యమన్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. కేసీఆర్ పదేళ్లలో రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసి అనేక అభివృద్ది, సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు.హైదరాబాద్ లో పేదలకు లక్ష డబుల్ బెడ్ రూమ్ లను కేసీఆర్ కట్టించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో ఒక్కఇల్లు కూడా కట్టించలేదని, హైడ్రా పేరుతో ఉన్న ఇళ్లను మాత్రం కూల్చుతున్నారని ద్వజమేత్తారు.

ఫస్టాప్ పాలన అట్టర్ ఫ్లాప్..

కాంగ్రెస్ సినిమాకు ఇంటర్వెల్ అయిపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.రెండున్నరేళ్ల ఫస్టాప్ పాలన అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పాలనను తిట్టుకోని వాళ్లు లేరన్నారు. తులం బంగారం, రైతులకు రూ.15 వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి తప్పారని ద్వజమేత్తారు.

కాంగ్రెస్ దండుపాళ్యం ముఠా..

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ మాఫియాతో పోల్చుతూ.. కాంగ్రెస్ నాయకులను దుండపాళ్యం ముఠాగా అభివర్ణించారు. ఆ మాఫియాలో రేవంత్ రెడ్డి ఒక పిల్ల నాయకుడన్నారు. రాష్ట్రంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని కేటీఆర్ అన్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం దగ్గర గోణే సంచులు కూడా లేవన్నారు. ఆ సంచులన్నీ ఢిల్లీకిపోతున్నాయని, రైతులకు ఇవ్వాల్సిన ‘రైతు బంధు’ డబ్బు బంద్ అయ్యిందని, ఆ పైసలన్నీ రాహుల్ గాంధీ ఖాతాలో ‘టింగ్ టింగ్’ అంటూ పడుతున్నట్లు ఘుటు విమర్శలు చేశారు.

గుండాయిజానిక భయపడోద్దు..

గుండాయిజం..రౌడియిజానికి కార్యకర్తలు భయపడోద్దని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. మల్కాజిగిరి లో ఒకడు నేను గుండాను..రౌడిని అని అంటున్నాడని, నిన్ను కొట్టే రౌడీలు,గుండాలు మా దగ్గర చాలా మంది ఉన్నారని హెచ్చరించారు. ఓ రౌడి వచ్చినా భయపడవ్దని,అవసరమైతే తానే అక్కడికి వస్తానన్నారు. పొరపాటున నాయకులు, కార్యకర్తలపై ఏ చిన్న కేసు పెట్టినా విడిపించుకుంటామని కార్యకర్తలకు భరోసా నిచ్చారు.

నిత్యం ప్రజాసేవలోనే...

మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజ్‌గిరి ప్రజలు తనపై ఉంచిన విశ్వాసంతో ఎమ్మెల్యేగా సేవ చేసే అవకాశం లభించిందని, ఆ బాధ్యతను ప్రజాసేవకు వచ్చిన పవిత్ర అవకాశంగా భావిస్తున్నానని తెలిపారు. గత రెండేళ్లుగా రైల్వే గేట్లు, ట్రాఫిక్ సమస్యలు, తాగునీటి కొరత, విద్యుత్ ,డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.1755 కోట్లకు పైగా నిధులు మంజూరు అయ్యేలా కృషి చేశామని, గౌతమ్‌నగర్ 5 ఎంఎల్ డి రిజర్వాయర్, విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఎఓసీ అదనపు రోడ్లు, జిల్లా కోర్టు భవనం, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్, బండ చెరువు అభివృద్ధి వంటి అనేక కీలక ప్రాజెక్టులను సాధించామని వివరించారు.

అరుంధతి హాస్పిటల్ ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంబీసీ చైర్మన్, మల్కాజ్‌గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్ నందికంటి శ్రీధర్, మల్కాజ్‌గిరి లోక్‌సభ ఇన్‌చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ గౌడ్, జగదీష్ గౌడ్, ఆకుల నర్సింగరావు, మురుగేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్ధం పరశురాం రెడ్డి, జేఏసీ వెంకన్న, జీకే హనుమంతరావు, అమీనుద్దీన్, చిన్న యాదవ్, ప్రభాకర్ గౌడ్, వంశీ ముదిరాజ్, హేమంత్ పటేల్, శ్రీధర్ గౌడ్, డోలి రమేష్, డిల్లీ పరమేష్, లక్ష్మణ్ యాదవ్, శోభన్, భాస్కర్ రెడ్డి, అరుణ్ రావు, అరవింద్, శివ గౌడ్, సాయి గౌడ్, గౌస్ ఇమ్రాన్, ఖలీల్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story