పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

by Batti.Sumithra |

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
X

దిశ, రామన్నపేట : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రామన్నపేట మండల కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరిత కార్యక్రమాలను ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా స్థానిక బాలుర ప్రభుత్వ పాఠశాలలో కేక్ కట్ చేసి, విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాల్ బహదూర్, ఎంపీడీవో రాములు, ఏపీఓ వెంకన్న, ఏపీఓ జానీ మియా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, భిక్షం రెడ్డి, స్థానిక సర్పంచ్ గరిక సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్మోహన్, గంగుల రాజిరెడ్డి, జినుకల ప్రభాకర్, ఉపసర్పంచ్ మోటే రమేష్, ఎండీ జమీరుద్దీన్, నాయకులు సాల్వేరు అశోక్, జెల్ల వెంకటేశం, బట్టే సంతోష్, గోదాసు పృథ్వి, ఎండీ రెహాన్, ఎండీ అక్రమ్, రామిని రమేష్, గుత్తా నర్సిరెడ్డి, అబ్రహాం, బొడ్డు సురేందర్‌రావు, పున్న అమరేందర్, వనం చంద్రశేఖర్, మోటే మహేష్, కొమ్ము శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story