మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే వేముల వీరేశం

by Batti.Sumithra |

చిట్యాల మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, నగర్‌కర్నూల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే వేముల వీరేశం
X

దిశ, చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, నగర్‌కర్నూల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఆస్పిరేషన్ టాయిలెట్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఆధునిక సౌకర్యాలతో ఈ టాయిలెట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. చిట్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.

మొక్కలు నాటిన ఎమ్మెల్యే

వనమహోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో ఎమ్మెల్యే వేముల వీరేశం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రత పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, వైస్ చైర్‌పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, డీసీసీ కార్యదర్శి పోకల దేవదాస్, కౌన్సిలర్లు కుక్కల మోహన్, ఏర్పుల పరమేశ్, బొబ్బలి సందీప్ రామ్‌రెడ్డి, దేశపాక లతా రాజేష్, కో-ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, పాటి మాధవరెడ్డి, ఎస్.కే. ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

Next Story