- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భావోద్వేగానికి గురైన కల్వకుంట్ల కవిత
సింగరేణి కార్మికుల సమస్యలు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విన్న కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు.

దిశ, గోదావరిఖని: సింగరేణి కార్మికుల సమస్యలు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విన్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. కార్మికుడి బాధలను వింటూ ఆమె కంటతడి పెట్టుకున్న దృశ్యాలు అక్కడ ఉన్న వారిని కదిలించాయి. శుక్రవారం గోదావరిఖనిలో బాయి బాటలో రామగుండం ప్రాంత పర్యటనలో భాగంగా సుందిళ్లలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా సింగరేణి ప్రాంతానికి చెందిన కార్మికులు తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమం, కుటుంబాల ఇబ్బందులు వంటి అంశాలను వివరించగా, వారి పరిస్థితులను విని కవిత భావోద్వేగానికి గురయ్యారు. సింగరేణి కార్మికులు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి కష్టాలు, సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తాను హామీ ఇచ్చారు. ఆలయ దర్శనం అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆమెను కలుసుకుని పలు సమస్యలను వివరించారు. కార్మికుల పట్ల ఆమె స్పందించిన తీరు అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.






