తహసీల్దార్‌ కార్యాలయంలో వసూళ్ల దందా

by velandi.Saikiran |   (  Updated:2026-06-19 11:07:43  IST  )

మిడ్జిల్ తహసీల్దార్‌ కార్యాలయం కొంత మంది సిబ్బందితో అవినీతికి అడ్డాగా మారింది.

తహసీల్దార్‌ కార్యాలయంలో వసూళ్ల దందా
X

దిశ, మిడ్జిల్: మిడ్జిల్ తహసీల్దార్‌ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. రైతుల భూముల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో రిజిస్ట్రేషన్ల పేరుతో అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. మిడ్జిల్ తహసీల్దార్‌ కార్యాలయంలో ఫైల్‌ కదలాలంటే రూ.2000 సమర్పించాల్సిందే అన్నట్లుగా వ్యవహారం తయారు ఐంది. రిజిస్ట్రేషన్‌ చేసే భూమిని బట్టి రూ.1000 నుంచి రూ.10 వేల వరకు ఒక్కో ఫైల్ కు కింది స్థాయి, కంప్యూటర్ సిబ్బంది వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో వీడియోగా మారింది.

ఫిర్యాదులు అందితే చర్యలు - తహసీల్దార్ రాఘవేందర్ రెడ్డి

మండలంలో రెవిన్యూ సిబ్బంది నగదు తీసుకున్నట్టు ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు తహసీల్దార్ రాఘవేందర్ రెడ్డి. ఎవరూ పైసా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. న్యాయబద్ధంగా ఉంటే పనిచేస్తారని తెలిపారు. ఎవరైనా డబ్బులు తీసుకున్నట్టు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story