- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్కు స్థలాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలి
ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్‌లో పలు కాలనీలకు చెందిన పార్కులను వైయస్సార్ సందర్శించారు.

దిశ, ఘట్కేసర్: పార్కు స్థలాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని, పార్కుల్లో బోర్డులు, లైట్లు ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి(వైయస్సార్) అధికారులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్‌లో పలు కాలనీలకు చెందిన పార్కులను వైయస్సార్ సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పార్కు స్థలాలపై జరుగుతున్న ఆక్రమణల గురించి వైయస్సార్ దృష్టికి తీసుకువచ్చి ఆందోళనను వ్యక్తం చేశారు.
సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. పార్కు స్థలాలను గుర్తించే విధంగా స్పష్టమైన నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రజల భద్రత, పార్కుల పరిరక్షణ కోసం తగినంత వీధి దీపాలు (లైట్లు) ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్ కాలనీ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, లక్ష్మీనగర్ కాలనీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ నెంబర్ వెంకటేష్ పటేల్, బిజెపి నాయకులు జగదీష్ గౌడ్, సతీష్ కుమార్, వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు.






