- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డేటా సెంటర్లను చల్లబరిచే టెక్నాలజీ.. కాపర్ కూలింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన నిపుణులు
కాపర్ కూలింగ్ సిస్టమ్ అనేది డేటా సెంటర్లలో ఇతర సాధారణ కూలింగ్ వ్యవస్థలకంటే సమర్థవంతంగా హీట్‌ను తొలగిస్తుందని సాంకేతిక పరిశోధకులు అంటున్నారు.

దిశ, ఫీచర్స్ : సాధారణంగా హై-పెర్ఫార్మెన్స్ డేటా సెంటర్లు, ఏఐ సర్వర్లు, క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్‌లలో హీట్‌ను తగ్గించడానికి ఎయిర్ కండిషనింగ్, కూలింగ్ టవర్లు, పంపులు ఉపయోగిస్తుంటారు. దీనికి విద్యుత్ ఖర్చు, నిర్వహణ కూడా బాగా పెరుగుతుంది. అయితే అందుకు ప్రత్యామ్నాయంగా, తక్కువ ఖర్చుతో ఆధునిక సాంకేతికతను డేటా సెంటర్ల కూలింగ్ వ్యవస్థలుగా ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. కాగా రీసెంట్‌గా యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ ఇంజనీర్లు(పరిశోధకులు) 3D ప్రింటింగ్ సాంకేతికతతో కొత్త రకం కాపర్ కూలింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికత డేటా సెంటర్లలో ఎనర్జీ వినియోగాన్ని బాగా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదిలాగో చూద్దాం.
త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో డెవలప్ చేసిన కాపర్ కూలింగ్ సిస్టమ్, ఇతర సాధారణ కూలింగ్ వ్యవస్థలకంటే ఎక్కువ సమర్థవంతంగా హీట్‌ను తొలగిస్తుందని సాంకేతిక పరిశోధకులు అంటున్నారు. ఎందుకంటే ఈ కొత్త కాపర్ కూలింగ్ ప్లేట్లలో మనుషుల వెంట్రుక కంటే సన్నని మైక్రోస్కోపిక్ చానెల్స్ ఉంటాయి. ఈ చిన్న మార్గాల ద్వారా కూలెంట్ లిక్విడ్ అతి ఎక్కువ సమర్థతతో ప్రవహించి, ప్రాసెసర్ల నుంచి హీట్‌ను నేరుగా తొలగిస్తుంది. సాధారణ ఎయిర్ కూలింగ్ సిస్టమ్‌లు నిర్వహించలేని, అధిక హీట్ లెవెల్స్‌ను కూడా ఈ సాంకేతికత సమర్థవంతంగా మేనేజ్ చేయగలదు. పైగా ఇది చిప్ లెవెల్‌లోనే హీట్‌ను తొలగించడం వల్ల గది మొత్తాన్ని చల్లబరచాల్సిన అవసరం తగ్గుతుంది. కాబట్టి ఈ పరిశోధకులు ఈ లిక్విడ్ కూలింగ్ విధానం సంబంధిత ఎనర్జీ వినియోగాన్ని 30-40% వరకు తగ్గిస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఏఐ సిస్టమ్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల భారీగా పెరుగుతున్న డేటా సెంటర్ల విద్యుత్ వినియోగ సమస్యకు ఇది చక్కటి పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నారు. ఈ కొత్త సాంకేతికతవల్ల డేటా సెంటర్ల ఖర్చులు, ఎనర్జీ వినియోగం భారీగా తగ్గి, పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని భావిస్తు్న్నారు. ఇది భవిష్యత్ ఏఐ & హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌కు ముఖ్యమైన ఆవిష్కరణగా పరిగణించబడుతోంది.






