నడిరోడ్డుపై కారులో చెలరేగిన మంటలు

by velandi.Saikiran |

కోదాడ -జడ్చర్ల జాతీయ రహదారిపై వెళుతోన్న‌ కారులో మంటలు చెలరేగాయి.

నడిరోడ్డుపై కారులో చెలరేగిన మంటలు
X

దిశ, చారకొండ: కోదాడ -జడ్చర్ల జాతీయ రహదారిపై వెళుతోన్న‌ కారులో మంటలు చెలరేగాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఓ కారులో మంట‌లు చెల‌రేగాయి. కోదాడ -జడ్చర్ల రహదారిపై శ్రీశైలం రోడ్డు కూడలి సమీపంలో ఈ పెను ప్ర‌మాదం చోటు చేసుకుంది. అయితే, మంట‌లు చెలరేగిన నేప‌థ్యంలో అల‌ర్ట్ అయిన ముగ్గులు ప్రయాణికులు, కారు దిగి అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story