‘ఫాస్ట్‌’ ఫుడ్ కాదు ప్రాణాలు తీసే ‘ఫుడ్’.. తింటే ఆరోగ్యం మటాష్

by Ajay Maddhiboyina |

హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు, హోట‌ళ్ల‌పై గ‌త కొంత‌కాలంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపుదాడులు నిర్వ‌హిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న చాలా రెస్టారెంట్లపై వేటు వేస్తున్నారు.

‘ఫాస్ట్‌’ ఫుడ్ కాదు ప్రాణాలు తీసే ‘ఫుడ్’.. తింటే ఆరోగ్యం మటాష్
X

దిశ‌, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు, హోట‌ళ్ల‌పై గ‌త కొంత‌కాలంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపుదాడులు నిర్వ‌హిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న చాలా రెస్టారెంట్లపై వేటు వేస్తున్నారు. అయితే దాడులు నిర్వహిస్తున్న క్రమంలో రెస్టాంరెంట్లలో, హోటళ్లకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొన్ని హోటళ్లలో పాడైపోయిన కూరగాయలు, మాసం వినియోగించడం, రంగులు, కల్తీ నూనెలు, అపరిశుభ్రంగా కిచెన్ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా చార్మినార్ లాడ్ బజార్ లోని ఓ ఇల్లీగల్ గోదాంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపుదాడులు చేశారు. ఈ తనిఖీల్లో నిషేధిత రంగులతో చికెన్ ఫ్రై చేస్తున్నట్టు గుర్తించారు.

అంతే కాకుండా మాడిపోయిన నూనెనే మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. అత్యంత అపరిశుభ్ర, ప్రమాదకర పరిస్థితుల్లో ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి. ఈ తనిఖీల్లో సుమారు 110 కేజీల తయారు చేసిన ఫ్రైడ్ చికెన్, 15 లీటర్ల మాడిపోయిన వంటనూనె, క్యాన్సర్ కారక రంగులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గోదాంను నిర్వహిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇటీవల కాలంలో రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు పెంచడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story