ఆనంద్ దేవరకొండ 'ఎపిక్' విడుదలపై సూపర్ అప్డేట్

by Pulgam srinivas |

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న 'ఎపిక్' చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆనంద్ దేవరకొండ ఎపిక్ విడుదలపై సూపర్ అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్: 'బేబీ' చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంట మరోసారి 'ఎపిక్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన దాదాపు అన్ని పనులు పూర్తైనట్లు సమాచారం. గతంలో సినిమా విడుదల తేదీపై పలు వార్తలు వచ్చినప్పటికీ, చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నాయని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబర్‌లో ఏదో ఒక తేదీని ఖరారు చేస్తూ త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు యూత్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 'బేబీ' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంట 'ఎపిక్'తో కూడా అదే స్థాయి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు శివాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Next Story