చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్.. అమెరికా-ఇరాన్ కీలక శాంతి చర్చలు రద్దు

by Malleboina Mahesh |

అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలు రద్దయ్యాయి. దీంతొ జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ పర్యటనను రద్దు చేసుకున్నారు.

చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్.. అమెరికా-ఇరాన్ కీలక శాంతి చర్చలు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇరాన్ యుద్ధం ముగింపు ప్రకటనతో సంతోషంలో ఉన్న ప్రపంచ దేశాలకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నేడు జరగాల్సిన కీలకమైన శాంతి చర్చల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. వివిధ కారణాలతో ఈ సమావేశం హఠాత్తుగా రద్దయ్యాయి. ఈ చర్చల కోసం వెళ్లాల్సిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ (JD Vance) తన స్విట్జర్లాండ్ పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు. అయితే, చర్చలు నిలిచిపోవడానికి గల కారణాలపై అమెరికా వైట్‌హౌస్, ఇరాన్ మీడియా భిన్నమైన వెర్షన్లను వినిపిస్తున్నాయి. స్విట్జర్లాండ్‌లో భద్రత, నిర్వహణ సంబంధిత ఏర్పాట్లలో తలెత్తిన సమస్యల వల్లే ఈ పర్యటన, చర్చలు రద్దయ్యాయని అమెరికా అధికారిక నివాసం వైట్‌హౌస్ ప్రకటించింది.

ఇదిలా ఉంటే ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా మాత్రం ఇందుకు భిన్నమైన కారణాన్ని వెల్లడించింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ నిరంతరాయంగా జరుపుతున్న దాడుల కారణంగానే ఈ శాంతి చర్చలు నిలిచిపోయాయని ఇరాన్ మీడియా స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రతిష్ఠంభన ఏర్పడినట్లు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో, ఇరు దేశాల మధ్య జరగాల్సిన ఈ శాంతి చర్చలు రద్దు కావడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.

Next Story