డీగ్లామరైజ్డ్ పాత్రలో ప్రియాంక మోహన్..

by Mallepaka Hamsa |

ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో హీరో శింబు- ప్రియాంకా మోహన్ కాంబినేషన్‌లో వచ్చే కొన్ని అత్యంత కీలకమైన రొమాంటిక్ సీన్లు, భావోద్వేగ సన్నివేశాలను డైరెక్టర్ వెట్రిమారన్ ఎంతో వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నారని టాక్.

డీగ్లామరైజ్డ్ పాత్రలో ప్రియాంక మోహన్..
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్-శింబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ‘అరసన్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై పరిసర ప్రాంతాలలో శరవేగంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న టాలెంటెడ్ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ షూటింగ్‌లో జాయిన్ అయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ రా అండ్ రియలిస్టిక్ కథలో ప్రియాంకా మోహన్ పాత్రే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో హీరో శింబు- ప్రియాంకా మోహన్ కాంబినేషన్‌లో వచ్చే కొన్ని అత్యంత కీలకమైన రొమాంటిక్ సీన్లు, భావోద్వేగ సన్నివేశాలను డైరెక్టర్ వెట్రిమారన్ ఎంతో వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నారని టాక్.

అయితే వెట్రిమారన్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా.. కథను మలుపు తిప్పేలా బలమైన పాత్రలుగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా ప్రియాంకా మోహన్ ఒక విభిన్నమైన, డీగ్లామరైజ్డ్, పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు టాక్. తన సహజసిద్ధమైన నటనతో మెప్పించే ప్రియాంకకు, ఈ చిత్రం తన కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుందని అభిమానులు భావిస్తున్నారు. కాగా.. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శింబు, ప్రియాంకలతో పాటు విజయ్ సేతుపతి, సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Next Story