మూడు రోజుల క్రితం భార్య.. నేడు భర్త ఉరివేసుకుని బలవన్మరణం

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-21 09:26:21  IST  )

భార్య అంత్యక్రియల అనంతరం కనిపించకుండా పోయిన వ్యక్తి ఆదివారం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మూడు రోజుల క్రితం భార్య.. నేడు భర్త ఉరివేసుకుని బలవన్మరణం
X

దిశ, తూప్రాన్: భార్య అంత్యక్రియల అనంతరం కనిపించకుండా పోయిన వ్యక్తి ఆదివారం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. ఇస్లాంపూర్ కి చెందిన సామల.వెంకటమ్మ కుటుంబ కలహాలతో మూడు రోజుల క్రితం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అంత్యక్రియల అనంతరం భర్త బిక్షపతి కనబడకుండా పోవడంతో తూప్రాన్ ఎస్ఐ గంగరాజు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కాగా ఆదివారం ఉదయం బ్రహ్మ పల్లి శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకుని బిక్షపతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్య మృతి చెందినదని తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యకి పాల్పడ్డాడా? లేదా ఇంకేమన్న కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story