మా తెలంగాణలో రాజకీయాలు చేస్తామంటే ఊరుకోం: పవన్‌కు TPCC CHIEF వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-19 12:21:56  IST  )

వైసీపీ అధినేత జగన్‌ను అరెస్ట్ చేయాలంటూ కేంద్రమంత్రి అమిత్ షాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరినట్లు విశ్వనీయంగా తనకు తెలిసిందని ఓ డిబేట్‌లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.

మా తెలంగాణలో రాజకీయాలు చేస్తామంటే ఊరుకోం:  పవన్‌కు TPCC CHIEF వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత జగన్‌(Ycp Chief Jagan)ను అరెస్ట్ చేయాలంటూ కేంద్రమంత్రి అమిత్ షా(Union Minister Amith Shah)ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) కోరినట్లు విశ్వనీయంగా తనకు తెలిసిందని ఓ డిబేట్‌లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఇందుకు కౌంటర్‌గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పై ఏపీ కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై పలు చోట్ల కేసులు సైతం నమోదు చేశారు.

కేసులెలా పెడతారు...?

అయితే తన వ్యాఖ్యలను ప్రొఫెసర్ నాగేశ్వరరావు వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ఫిర్యాదులు చేయడం, కేసులు పెట్టడం వంటి వాటిపై తెలంగాణలో పలువురు స్వంతంత్ర జర్నలిస్టులు తప్పుబట్టారు. తెలంగాణ వాదానికి తెరపైకి తీసుకొచ్చారు. ఏపీ డిప్యూటీ పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇదే సమయంలో జూన్ 2న జనసేన పార్టీ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తామని ప్రకటన చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అనుమతి ఇవ్వొద్దంటూ కామెంట్లు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు నేతలు పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. ఆంధ్రా డిప్యూటీ సీఎం తెలంగాణలో ఏం పని అంటూ మండిపడ్డారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో వివాదం సర్దుమనిగింది.

రగిలిపోయిన కాంగ్రెస్

కానీ పవన్ కల్యాణ్ ఢిల్లీలో సమావేశం నిర్వహించి ఏపీ, తెలంగాణ విభజనపై మాట్లాడుతూ కాంగ్రెస్‌ను తప్పుబట్టారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో సభలు పెట్టాలంటే స్థానికులై ఉండాలా అని ప్రశ్నించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రగిలిపోయారు. పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.అయితే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, పోటీ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

మణికొండలో పార్టీ కార్యాలయం

ఇదిలా ఉంటే హైదరాబాద్ మణికొండలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ స్పందించారు. తెలంగాణకు పవన్‌ కల్యాణ్‌ వచ్చినా కమల కల్యాణ్‌ వచ్చినా నష్టంలేదన్నారు. కానీ రాజకీయాలు చేస్తామంటే కుదరదని మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.

Next Story