- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రాచలాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలి
భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని హరిత వనంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే వెంకట్రావు కోరారు.

దిశ, భద్రాచలం : భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని హరిత వనంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే వెంకట్రావు కోరారు. గ్రీన్ భద్రాద్రి నూతన కమిటీ నియామకానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయం గా పనిచేస్తున్న గ్రీన్ భద్రాద్రి సంస్థ 14వ నూతన కార్యవర్గాన్ని ఘనంగా ఎన్నుకుంది. సంస్థ అధ్యక్షుడిగా ఆర్. రామకృష్ణారెడ్డి, కార్యదర్శిగా భుక్యా రంజిత్ నాయక్, కోశాధికారిగా ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణదొర పాల్గొని మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న గ్రీన్ భద్రాద్రి సేవలు అమోఘం అని అన్నారు.ఈ కార్యక్రమంలో యోగి సూర్యనారాయణ, పాకాల దుర్గాప్రసాద్, భగవాన్ స్వీట్స్ శంకర్, పల్లంటి దేశప్ప, రాజారెడ్డి, చిట్టి లలిత, డాక్టర్ గోళ్ల భూపతిరావు, ఉమాశంకర్ నాయుడు, కృష్ణార్జునరావు, బొలిశెట్టి రంగారావు, చింతిరియాల రవికుమార్, పరమి సోమశేఖర్, శ్రీనివాసరావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






