- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం: బొత్స స్ట్రాంగ్ వార్నింగ్
రౌడీ అనే పదం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కే వర్తిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో వైసీపీ నేతల భేటీలో ఆయన పాల్గొన్నారు. ...

దిశ, వెబ్ డెస్క్: రౌడీ అనే పదం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan)కే వర్తిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Ycp Mlc Bosta Satyanarayana) అన్నారు. కోనసీమ జిల్లా వెంకటాయపాలెం(Venkatayapalem)లో వైసీపీ నేతల(Ycp Leaders) భేటీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ వైసీపీ కాపు నేతలు రౌడీలు అనుకుంటున్నారా అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆయన ప్రశ్నించారు. . అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. త్వరలో తిరుపతి, విశాఖలో కాపులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సాయికృష్ణ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సిన హక్కులు అడుగుతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని, కాపులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కులాన్ని చూసే తమకు పదవులు వస్తున్నాయని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సాయికృష్ణ మృతదేహాన్ని కూడా లేకుండా చేశారని, పోలీస్‌ను సస్పెండ్ చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. క్రిమినల్స్ అయితే చంపేస్తారా..? అని, రాజ్యాంగం చెప్పిందా అని నిలదీశారు. కూటమి నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితేకుదరదని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.






