జనగామ పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు

by velandi.Saikiran |

జనగామ సౌందర్యవంతీకరణలో భాగంగా వంతెన కింద ఉన్న నిర్లక్ష్య ప్రాంతాన్ని పచ్చదనంతో అభివృద్ధి చేసేందుకు మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది.

జనగామ పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు
X

దిశ, జనగామ: జనగామ పట్టణ సౌందర్యవంతీకరణలో భాగంగా వంతెన కింద ఉన్న నిర్లక్ష్య ప్రాంతాన్ని పచ్చదనంతో అభివృద్ధి చేసేందుకు మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. పట్టణంలోని వంతెన కింద ప్రాంతం చాలా కాలంగా దుమ్ము, చెత్త, ఎండిపోయిన కొమ్మలు, కలుపు మొక్కలతో నిండిపోయి ఉండటంతో జనగామ మున్సిపల్ వైస్ చైర్మన్ భూషా పర్వతాలు, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారి ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది విస్తృత పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి చెత్త, దుమ్ము, ఎండిన కొమ్మలను తొలగించారు. అనంతరం ఆ ప్రాంతంలో మొక్కలు నాటి గ్రీనరీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. వంతెన కింద ఖాళీ ప్రదేశాన్ని ఆకర్షణీయమైన పచ్చని వాతావరణంగా మార్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ గ్రీనరీ ఏర్పాటుతో ఆ ప్రాంతం మరింత అందంగా మారడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడనుంది. ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

Next Story