'ఓ..! సుకుమారి' టైటిల్ సాంగ్ రిలీజ్ డేట్..టైమ్ ఫిక్స్

by Pulgam srinivas |

'ఓ..! సుకుమారి' టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను జూన్ 21న ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఓ..! సుకుమారి టైటిల్ సాంగ్ రిలీజ్ డేట్..టైమ్ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఓ..! సుకుమారి'. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్రబృందం మరో ఆసక్తికర అప్డేట్‌ను విడుదల చేసింది. ఈ సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల తేదీ, సమయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జూన్ 21న ఉదయం 11:11 గంటలకు టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో గ్రామీణ వాతావరణం, పల్లెటూరి అందాలు ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. హీరోయిన్ సంప్రదాయ దుస్తుల్లో ఫోన్‌లో మాట్లాడుతుండగా, హీరో బైక్‌పై స్టైలిష్‌గా కనిపిస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాడు. పోస్టర్‌ను బట్టి ఈ చిత్రం ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, గ్రామీణ జీవనశైలికి దగ్గరగా ఉండే కథాంశంతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి భరత్ ధర్షన్ దర్శకత్వం వహిస్తుండగా, మహేశ్వర రెడ్డి మూలి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.




Next Story