- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్‌కు దీటుగా ‘పాలన’: హైదరాబాద్‌లో తొలి డే కేర్ సెంటర్ ప్రారంభం
పిల్లల సంరక్షణ కోసం మహిళలు తమ ఉద్యోగాలను, ఉపాధిని వదులుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తోందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ..

దిశ, తెలంగాణ బ్యూరో: పిల్లల సంరక్షణ కోసం మహిళలు తమ ఉద్యోగాలను, ఉపాధిని వదులుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తోందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని అరుంధతి నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రం-కమ్-పాలన (డే కేర్) కేంద్రాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోనే తొలి 'పాలన' కేంద్రాన్ని చాంద్రాయణగుట్టలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కేంద్రాలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. "వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ నర్సరీ సెంటర్లలో చేర్పించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ప్రజల ఇంటి వద్దకే నాణ్యమైన సేవలను తీసుకువచ్చింది. ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారులకు సంరక్షణ, పోషకాహారం, ఆటల ద్వారా అభ్యాసం అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుంది." అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తూ.. 57 రకాల ఆటవస్తువులు, యూనిఫాంలు, నాణ్యమైన ప్రీ-స్కూల్ విద్యతో పాటు అల్పాహారాన్ని కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనితా రామచంద్రన్, బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్, ఎస్బీఐ ఫౌండేషన్ ప్రతినిధులు, అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.






