- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు సేంద్రీయ పంటలను ఉత్పత్తి చేయాలి : రఘునందన్ రావు
రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులతో పంటల ఉత్పత్తిని పెంచి ప్రజలకు కల్తీ లేని నాణ్యమైన ఆరోగ్యమైన పంట ఉత్పత్తులను పండించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పిలుపునిచ్చారు.

దిశ, కౌడిపల్లి : రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులతో పంటల ఉత్పత్తిని పెంచి ప్రజలకు కల్తీ లేని నాణ్యమైన ఆరోగ్యమైన పంట ఉత్పత్తులను పండించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామ శివారులోని కృషి విజ్ఞాన కేంద్రంలో మెదక్ పార్లమెంట్ పరిధిలోని రైతుల కోసం ప్రకృతి వ్యవసాయం పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పూర్వం మన భారతదేశంలో రైతులు ప్రకృతి వ్యవసాయంతో పంటలు పండించేవారని దీంతో ఎటువంటి రోగాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించారని పేర్కొన్నారు. రసాయనిక ఎరువులు వాడి నేల తల్లిని విధ్వంసం చేయవద్దని అన్నారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల కోసం ప్రత్యేకంగా రైతు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు.
ఈ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని మనిషిని ఆరోగ్యంగా ఉంచే జొన్నలు రాగులు సజ్జలు కొర్రలు సామలు పండించేందుకు కృషి చేయాలి అన్నారు. పశు సంపదను పెంచి వాటి పేడ ఎరువుతో సేంద్రీయ వ్యవసాయం పై ఆయన అన్నారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేశారని, పక్కనే 500 పడకల ఆసుపత్రిని నిర్మించారని ఈ సందర్భంగా రఘునందన్ రావు తెలిపారు. పాత రోజుల వ్యవసాయం పట్ల రైతులు ఆసక్తి పెంపొందించుకోవాలని రఘునందన్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఇంచార్జి అభయ్ పాటిల్, కిషన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, కేవీకే హెడ్ సంబాజీ నల్కర్, శాస్త్రవేత్తలు రవికుమార్, ప్రతాప్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్ కుమార్, ఏడీఏ పుణ్యవతి, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.






