- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ క్రేజీ సీజన్‌లో 'విశ్వంభర'.. పోటీ గట్టిగానే ఉండనుందా?
విశ్వంబర సినిమాను ఈ ఏడాది దసరా బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం క్రితం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మొదలైన చాలా కాలానికి చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమాను స్టార్ట్ చేసాడు. ఆ సినిమాను పూర్తి చేసి ఇప్పటికే విడుదల కూడా చేశాడు. కానీ ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు మాత్రం ఏవీ బయటకు రావడం లేదు. ఇక ఇంతలోనే చిరంజీవి, బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనిని సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.
ఇలా చిరంజీవి ‘విశ్వంభర’ తర్వాత మొదలుపెట్టిన సినిమాలు విడుదల అవడం, పూర్తి అవుతుండడంతో మెగా అభిమానులు ఎప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని తెగ టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమా విడుదలపై తాజాగా ఓ అప్‌డేట్ వైరల్‌గా మారింది. ఈ సినిమాను ఈ ఏడాది దసరా బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నట్లు, అందుకు అనుగుణంగా పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను ఈ ఏడాది దసరా బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా చాలా సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. వాటితో పాటు ఈ సినిమా కూడా రిలీజ్ అయితే దసరాకు బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






