- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్నోని వదిలి ఢిల్లీ జట్టులోకి రిషబ్ పంత్
మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి రిషబ్ పంత్.. బదులుగా లక్నోలోకి కుల్దీప్ యాదవ్! భారీ స్వాప్ ట్రేడ్‌తో ఐపీఎల్‌లో కొత్త సమీకరణాలు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ముగిసిన కొద్ది రోజులకే.. ఐపీఎల్ 2027 మెగా వేలం ఫీవర్ స్టార్ట్ అయింది. గత సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ప్లేయర్లు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో IPL 2027 రాబోయే సీజన్‌కు ముందే ట్రేడింగ్ విండోలో ఒక సంచలన మార్పు చోటు చేసుకోబోతున్నట్లు క్రికెట్ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. గడిచిన మెగా వేలంలో రికార్డు స్థాయిలో ఏకంగా ₹27 కోట్లకు లక్నో సూపర్ జైంట్స్ (LSG) సొంతం చేసుకున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, మళ్లీ తన పాత జట్టు అయిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC) గూటికి చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2026 సీజన్‌లో లక్నో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవడం, కెప్టెన్‌గా పంత్ విఫలం కావడంతో అతడే స్వయంగా లక్నో మేనేజ్‌మెంట్‌ను సంప్రదించి ఢిల్లీకి వెళ్లేందుకు అనుమతి కోరినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జైంట్స్ ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ పర్యవేక్షణలో జట్టును సరికొత్తగా రీబిల్డ్ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే రిషబ్ పంత్‌ను ఢిల్లీకి వదిలిపెట్టి, దానికి బదులుగా (Swap Trade) ఢిల్లీ క్యాపిటల్స్ నుండి స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తమ జట్టులోకి తీసుకోవాలని లక్నో వ్యూహం రచిస్తోంది. ఈ విధంగా పంత్ మళ్లీ తన హోమ్ టీమ్ అయిన ఢిల్లీకి కెప్టెన్‌గా వెళ్లే అవకాశం లభిస్తుంది. అలాగే లక్నోకు తమ స్పిన్ విభాగాన్ని బలోపేతం చేసుకునే వీలుంటుంది. కాబట్టి ఇది పూర్తిగా ఇరు జట్ల వ్యూహాత్మక మార్పే తప్ప, ఆర్థిక ఇబ్బందుల వల్ల కాదు.






