ఢిల్లీ ముందు మోకరిల్లారు.. రేవంత్‌పై కేపీ వివేకానంద ఫైర్

by Vemula.Srinu Prasad |

కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం రేవంత్‌రెడ్డికి లేదని బీఆర్ఎస్ఎల్పీ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు..

ఢిల్లీ ముందు మోకరిల్లారు.. రేవంత్‌పై కేపీ వివేకానంద ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం రేవంత్‌రెడ్డికి లేదని బీఆర్ఎస్ఎల్పీ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి అబద్ధాల పునాదులపై సీఎం అయ్యారని.. రెండున్నరేళ్లలో హామీలు నేరవేర్చలేదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై బురదజల్లుతున్నారని.. సీఎం కావాలని అనేక పార్టీలు మారిన చరిత్ర రేవంత్‌ది అని ఎద్దేవా చేశారు. రియల్ ఎస్టేట్ దందా చేస్తూ రూ.12 వేల కోట్ల విలువైన భూములు అమ్మారని.. రాయదుర్గం వద్ద ఉన్న భూమికి హైకోర్టులో ఉత్తర్వులు ఉన్నా ఈ-వేలం ద్వారా వేరే కంపెనీకి విక్రయించారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సీఎంగా ఉండి చీటర్, గజదొంగ, మోసగాడిలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సీఎం మొత్తం భూముల చుట్టూనే తిరుగుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు.. హిల్ట్ పాలసీ ద్వారా భూములను తన బినామీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

మూసీ ప్రక్షాళన పేరుతోనూ భూదందా చేస్తున్నారన్నారు. కేసీఆర్ నామస్మరణ లేనిది ఆయనకు నిద్ర పట్టడం లేదని.. హైదరాబాద్‌ను విస్మరించి ఫ్యూచర్ సిటీ కడుతున్నారని పేర్కొన్నారు. సిద్దిపేటలో హరీశ్‌రావుపై పోటీ చేసి రేవంత్ గెలవాలని.. అక్కడ పోటీ చేస్తే బలి కావడం పక్కా అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో భూముల అమ్మకం ద్వారా నగరంలో అభివృద్ధి చేశామని.. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకం ద్వారా రూ.12వేల కోట్లతో ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story