యువకుడి మృతి కలకలం.. హత్య చేసి ఉంటారని అనుమానం..?

by Taduka Kalyani |

అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో విషాదాన్ని నింపింది.

యువకుడి మృతి కలకలం.. హత్య చేసి ఉంటారని అనుమానం..?
X

దిశ, నేరడిగొండ: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుగ్గారం గ్రామానికి చెందిన నాథరి సతీష్ (23) గత బుధవారం పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. మూడు రోజులుగా కుటుంబ సభ్యులు, బంధువులు గాలించినా అతడి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో శుక్రవారం బోత్ మండలంలోని కరత్వాడ చెరువులో ఓ మృతదేహం తేలినట్లు సమాచారం అందడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని పరిశీలించగా అది సతీష్‌దేనని గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని బోత్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబానికి ఒక్కగానొక్క కుమారుడైన సతీష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి రోదనలు హృదయ విదారకంగా మారాయి. యువకుడి మృతికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Next Story