- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రన్నింగ్ కారులో మంటలు.. దగ్ధమైన కారు ముందు భాగం..
by Taduka Kalyani |
అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని డైరీ ఫార్మ్ చౌరస్తాలో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి.

X
దిశ, రాజేంద్రనగర్ : అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని డైరీ ఫార్మ్ చౌరస్తాలో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి.శుక్రవారం మధ్యాహ్నం డైరీ ఫార్మ్ చౌరస్తా మీదుగా ఆరాంఘర్ వైపు వెళ్తున్న కారు ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ వెంటనే కారును నిలిపివేశాడు. దీంతో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ తోపాటు మరో వ్యక్తి వెంటనే కారులోంచి దిగిపోయారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. కారు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వాహన రాకపోకలను నియంత్రి మంటలను ఆర్పివేశారు. అయితే కారు ఎవరిదనే విషయం తెలియరాలేదు. కారు ప్రమాద విషయమై ఎవరు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.
Next Story






