టీయూ డ్రగ్స్ నోడల్ ఆఫీసర్ గా ఆచార్య కె. లావణ్య నియామకం

by Batti.Sumithra |

తెలంగాణ యూనివర్శిటీ మాదక ద్రవ్యాల (డ్రగ్స్) నోడల్ ఆఫీసర్ గా ప్రొఫెసర్ కరిమిండ్ల లావణ్య నిమమితులయ్యారు.

టీయూ డ్రగ్స్ నోడల్ ఆఫీసర్ గా ఆచార్య కె. లావణ్య నియామకం
X

దిశ, డిచ్‌‌పల్లి : తెలంగాణ యూనివర్శిటీ మాదక ద్రవ్యాల (డ్రగ్స్) నోడల్ ఆఫీసర్ గా ప్రొఫెసర్ కరిమిండ్ల లావణ్య నిమమితులయ్యారు. యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ టి.యాదగిరిరావు ఆదేశాల మేరకు లావణ్యను డ్రగ్స్ నోడల్ ఆఫీసర్ గా నియమిస్తూ వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి ఉత్వర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా ఆచార్య లావణ్య మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణతో పాటు వాటి పై యువతకు అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహిస్తానన్నారు. నిపుణులతో ముఖాముఖి చర్చలు ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తానని ఆమె తెలిపారు. విశ్వవిద్యాలయంలో అవగాహన సదస్సుల నిర్వహణతో పాటు అమలుకు చర్యలు, పర్యవేక్షణ బాధ్యతలను ఆమె నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ఆచార్య లావణ్యకు యూనివర్సిటీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

Next Story