పిడుగుపడి ఇద్దరికి తీవ్ర గాయాలు

by Batti.Sumithra |

నాగారం మండల పరిధిలోని వర్ధమానుకోట రెవెన్యూ శివారులో గురువారం సాయంత్రం భారీ వర్షంతో పాటు పిడుగులు పడటంతో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది.

పిడుగుపడి ఇద్దరికి తీవ్ర గాయాలు
X

దిశ, నాగారం : నాగారం మండల పరిధిలోని వర్ధమానుకోట రెవెన్యూ శివారులో గురువారం సాయంత్రం భారీ వర్షంతో పాటు పిడుగులు పడటంతో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నాగారం బంగ్లా గ్రామానికి చెందిన కన్నెబోయిన కుమార్ (40), వర్ధమానుకోట గ్రామానికి చెందిన ఆవుల రమేష్ (30) వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఈ సమయంలో ఇద్దరూ ఒకే చోట ఉండగా పిడుగు పడింది. ఈ ఘటనలో ఆవుల రమేష్‌కు స్వల్ప గాయాలు కాగా, కన్నెబోయిన కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన స్పృహ కోల్పోయారు. గ్రామస్థులు వెంటనే కుమార్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Next Story