మాకు సహకరించండి: బెంగాల్‌ పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ రిక్వెస్ట్

by Vemula.Srinu Prasad |

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరసలో ఉందని, ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణంతోపాటు మౌలిక సదుపాయాలు ఉన్నాయని, కాబట్టి పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టండంటూ మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు...

మాకు సహకరించండి: బెంగాల్‌ పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ రిక్వెస్ట్
X

దిశ, ఏపీ బ్యూరో: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరసలో ఉందని, ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణంతోపాటు మౌలిక సదుపాయాలు ఉన్నాయని, కాబట్టి పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టండంటూ మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం కోల్‌కతాలోని ఐసీసీ ప్లీనరీలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌ అంతకుముందు బెంగాల్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి అని వారికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలి..

తొలుత వీసా స్టీల్‌ వైస్‌ చైర్మన్‌–మేనేజింగ్‌ డైరక్టర్‌ విశాల్‌ అగర్వాల్, ఇమామీ గ్రూప్‌ డైరక్టర్‌ ఆదిత్య ఆగర్వాల్, శ్రీ సిమెంట్స్‌ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌ బంగూర్‌లతో లోకేశ్‌ కోల్‌కతాలో భేటీ అయ్యారు. భారతదేశంలో ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యంగా మంత్రి లోకేష్‌ చెప్పారు. పెట్టుబడులను సులభతరం చేయడం, పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడంలోనూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న చురుకైన విధానాన్ని వారు అభినందించారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు భాగం కావాలని విజ్ఞప్తి చేశారు.

క్రాప్‌ వాల్యూ చైన్‌ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టండి..

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌ హాస్పిటాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, విశాఖలో సుమారు 220 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకొని, ఇప్పటికే పనులు ప్రారంభించాయని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి క్రాప్‌ వాల్యూ చైన్‌ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని ఐటీసీ చైర్మన్‌–ఎండీ సంజీవ్‌ పూరికి మంత్రి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడగలిగే వంగడాల సృష్టి్ట, అగ్రి ఫారెస్ట్రీ, ఆదర్శ గ్రామాల నిర్మాణంలో ఏపీతో కలసి పనిచేయాల్సిందిగా కోరారు. ఐటీసీ చైర్మన్‌ సంజీవ్‌ పూరి స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. రాయలసీమలో ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ హబ్‌ ఏర్పాటుచేయాలని విక్రమ్‌ సోలార్‌ సీఈఓ అరుణ్‌ మిట్టల్, ఎండీ జ్జానేష్‌ చౌదరిని మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.

అలాగే రాష్ట్రంలో సిలికాన్‌–కార్బన్‌ యానోడ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని హిమాద్రీ స్పెషాలిటీ కెమికల్స్‌ íసీఎండీ అనురాగ్‌ చౌదరిని లోకేశ్‌ కోరారు. అదేవిధంగా ఏపీలో ఈవీ గ్రేడ్‌ అల్యూమినియం తయారీ యూనిట్‌ను నెలకొల్పండంటూ శ్యామ్‌ మెటాలిక్స్, స్పెల్టర్స్‌ లిమిటెడ్, రష్మీ మెటాలిక్స్‌ ప్రతినిధుల భేటీలో మంత్రి లోకేశ్‌ ప్రతిపాదించారు.

Next Story