- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దద్దరిల్లుతున్న ‘ఉత్తమ్ అన్న’ సాంగ్
మంత్రి యన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ‘దద్దరిల్లుతున్న ఉత్తమ్ అన్న’ ఆడియో సాంగ్ శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఘనంగా విడుదలైంది.

దిశ, హుజూర్‌నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి యన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా రూపొందించిన ‘దద్దరిల్లుతున్న ఉత్తమ్ అన్న’ ఆడియో సాంగ్ శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఘనంగా విడుదలైంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం పాలకవీడు మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ మాలోత్ బుజ్జి మోతిలాల్ తన అభిమానాన్ని చాటుకుంటూ ఈ పాటను రూపొందించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ, రాజకీయ విజయాలు, ప్రజాసేవలను ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించారు.
నల్గొండ గద్దర్‌గా పేరుగాంచిన నర్సిరెడ్డి ఆలపించిన ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో మైక్ టీవీ అధినేత అన్నపురెడ్డి అప్పిరెడ్డి, చక్రధర్ రావు, చలసాని రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆడియో సాంగ్‌ను విడుదల చేశారు. పాటను విన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాట రచనకు కృషి చేసిన మాలోత్ మోతిలాల్‌ను అభినందించారు. ఈ సందర్భంగా మోతిలాల్ మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ పాటను రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాధరణ పొందేలా ఆడియో సాంగ్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు సందీప్ రెడ్డి, ఉపేందర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






