ఏపీపై ద్రోణి ప్రభావం.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-19 15:52:07  IST  )

తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు...

ఏపీపై ద్రోణి ప్రభావం.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్
X

దిశ‌, ఏపీ బ్యూరో: తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు.

సిద్దరాంపురంలో 61మిమీ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం

శుక్ర‌వారం సాయంత్రం 5 గంటల స‌మ‌యానికి అనంతపురం జిల్లా సిద్దరాంపురంలో 61మిమీ అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా, శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 36మిమీ, వైఎస్సార్ కడప జిల్లా చౌడూరులో 31మిమీ, శ్రీకాకుళం జిల్లా మేలియపుట్టిలో 29.9మిమీ, విజయనగరం జిల్లా గుర్లలో 28.2మిమీ, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి 26.5మిమీ, కోటబొమ్మాళిలో 26.2మిమీ, లావేరులో 22.5మిమీ, కర్నూలు జిల్లా తోవిలో 22మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.

Next Story