ఆల్కాపురిలో భారీ సిలిండర్ పేలుడు

by Taduka Kalyani |

నార్సింగి పరిధిలోని ఆల్కాపురి రోడ్ నెం.9లో బామ్మా టిఫిన్ సెంటర్ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటలకు బాల్కనీలో ఉంచిన గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ శబ్దం వినిపించి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఆల్కాపురిలో భారీ సిలిండర్ పేలుడు
X

దిశ, గండిపేట: నార్సింగి పరిధిలోని ఆల్కాపురి రోడ్ నెం.9లో బామ్మా టిఫిన్ సెంటర్ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటలకు బాల్కనీలో ఉంచిన గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ శబ్దం వినిపించి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి బాల్కనీ ఐరన్ గ్రిల్ ఊడిపడి రోడ్డుకు అవతల ఉన్న భవనాన్ని తాకి కిందపడింది. ఇంట్లోని సామగ్రి చెల్లాచెదురవడంతో పాటు బెడ్‌రూమ్ గోడకు పెద్ద రంధ్రం ఏర్పడింది. ఘటన సమయంలో ఇంట్లో ఉన్న దంపతులు, వారి చిన్న కుమారుడు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకోగా, మహిళ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు కారణాలపై పోలీసులు విచారణ చేపట్టగా, ఆల్కాపురి ప్రాంతంలో ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. సిలిండర్ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బాల్కనీలో ఎండ వేడిమి కి పేలిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story