- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంద పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ అన్నారు.

దిశ మధిర : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ అన్నారు. శుక్రవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డ్ ఎంప్లాయిస్ కాలనీలో గల వంద పడకల ఆసుపత్రిని అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న వైద్య సదుపాయాలను పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించాలని సూచించారు. 100 పడకల ఆసుపత్రిలో ల్యాబ్ కు మరియు అవసరమైన పరికరాలను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. మండల కేంద్రంలోని శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయ సమీపంలోనే వైరా నది ఒడ్డున ఉన్న హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులను, అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు లోపించకూడదని, త్వరతిగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపాలిటీ కమిషనర్ శామ్యూల్ ఇజ్రాయిల్ పాల్, మున్సిపాలిటీ చైర్పర్సన్ సామినేని సుజాత, వైస్ చైర్ పర్సన్ కోనా ధని కుమార్ 17వ వార్డు కౌన్సిలర్ ములకలపల్లి వినయ్ కుమార్ కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.






