- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్ : ఇంద్రానగర్ లో రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి ప్రవాహానికి చెక్
"పారుతున్న మురుగు.. వర్షం కురిసి వారం గడిచినా తగ్గని మురుగు" శీర్షికన దిశలో ప్రచురితమైన కథనానికి జలమండలి, సీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు స్పందించారు.

దిశ, శేరిలింగంపల్లి: "పారుతున్న మురుగు.. వర్షం కురిసి వారం గడిచినా తగ్గని మురుగు" శీర్షికన దిశలో ప్రచురితమైన కథనానికి జలమండలి, సీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు స్పందించారు. గచ్చిబౌలి ఇంద్రానగర్‌లో పూడికపోయిన కాలువలను జెట్టింగ్ యంత్రంతో శుభ్రం చేయడంతో రోడ్లపై ప్రవహిస్తున్న మురుగు నీటికి అడ్డుకట్ట పడింది. జలమండలి ఏఈ సందీప్ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ దిశకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, మట్టి పేరుకుపోవడంతో కాలువలు పూడుకుపోయి మురుగు నీరు రోడ్లపైకి చేరినట్లు అధికారులు గుర్తించారు. అధిక వర్షపాతం కారణంగా కాలువల్లో బురద పేరుకుపోవడం, సివరేజ్ కనెక్షన్లు ప్రధాన కాలువకు అనుసంధానం కావడం, పైప్‌లైన్లలో మట్టి చేరి వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం కలగడంతో ఈ సమస్య ఏర్పడినట్లు వెల్లడించారు. జెట్టింగ్ యంత్రంతో కాలువలను శుభ్రం చేయడంతో ప్రస్తుతం మురుగు నీరు సాఫీగా వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నాలాను విస్తరించడం, డైవర్షన్ ఏర్పాటు చేయడం అవసరమని స్థానికులు సూచిస్తున్నారు. గచ్చిబౌలి ప్లాటినం భవనం నుంచి అంజయ్యనగర్ పరిసర ప్రాంతాల మురుగు నీరు మొత్తం ఇంద్రానగర్ కాలువ గుండా వెళ్లాల్సి రావడంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలు పైప్‌లైన్లలో జామ్‌కు కారణమవుతున్నాయని తెలిపారు. ప్రత్యేక డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేసి నాలా విస్తరణ చేపడితేనే ఇంద్రానగర్ మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కాలనీవాసులు కోరుతున్నారు.






