- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూకబ్జా కేసు...సీఐ శ్రీధర్ రావుపై డీజీపీకి ఫిర్యాదు
సీఐ శ్రీధర్ రావుపై డీజీపీకి ఫిర్యాదు అందింది.

దిశ, ధర్మసాగర్: సీఐ శ్రీధర్ రావుపై డీజీపీకి ఫిర్యాదు అందింది. రెండు లక్షలు లంచం తీసుకున్నాడనే ఆరోపణలు సీఐపై ఆరోపణలు వచ్చాయి. తన భూమిని ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటానని, రెండు లక్షలు లంచం తీసుకుని.. న్యాయం చేయకుండా అతనికే సీఐ అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని డీజీపీకి ఫిర్యాదు చేశారు బాధితులు బొంపెల్లి సుధీర్ రావు. ధర్మసాగర్ మండలం పెద్ద పండ్యాల నర్సింగరావు పల్లె రోడ్డు లోని తన భార్య కృష్ణ ప్రియ పేరుతో 2013లో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు సుధీర్ రావు.
ఈ క్రమంలోనే మణుగూరు కనకయ్య అనే వ్యక్తి భూమిని ఆక్రమించుకున్నాడు. దీనిపై రెండు నెలల క్రితం ఫిర్యాదు చేసినా సుధీర్ రావుకు న్యాయం జరుగలేదు. అయితే న్యాయం చేస్తానని చెప్పి గత నెల ఏప్రిల్ 23న మధ్యవర్తి రిటైర్డ్ ఏసిపి ద్వారా శ్రీధర్ రావు లక్ష లంచం తీసుకున్నట్లు బాధితుడు సుధీర్ వెల్లడించారు. మే 5న మరో లక్ష ఇచ్చినట్లు బాధితుడు సుధీర్ రావు ఆరోపించారు. అయినా న్యాయం జరుగకపోవడంతో డీజీపీకి ఫిర్యాదు చేశాడు సుధీర్ రావు. దీనిపై సీఐ శ్రీధర్ రావు కూడా రియాక్ట్ అయ్యారు. కావాలనే కొంతమంది తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు.






