- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, ముస్తాబాద్: పానీపూరి ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ముస్తాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం అధికారులు విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ ఎండీ ఫారుక్, ఎంపీడీఓ లచ్చాలు, ఎంపీవో వహీద్, పంచాయతీ కార్యదర్శి రమేష్, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి హోటళ్లు, బేకరీలు, మెస్‌లు, వైన్స్ పర్మిట్ రూమ్‌లను పరిశీలించారు. పరిశుభ్రత ప్రమాణాలు పాటించని వ్యాపార సంస్థలకు జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే సీజ్ చేసే చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. కాగా ముస్తాబాద్ మండల కేంద్రం లో అధికారులు విస్తృతంగా తనిఖీ లు చేపట్టాగా ఓ బేకరీ లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని గుర్తించి బేకరీ యాజమానికి జరిమానా విధించారు.
Next Story






