- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'మా ఇంటి బంగారం'.. ఆ రేర్ మార్క్‌ను దాటేసింది
'మా ఇంటి బంగారం' చిత్రానికి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.28 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ నటి సమంతకు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతటి స్టార్‌డమ్ ఉన్నప్పటికీ ఆమె వరుస సినిమాలు చేయడంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 'ఖుషి' సినిమా తర్వాత కొంత విరామం తీసుకున్న సమంత, తాజాగా దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన 'మా ఇంటి బంగారం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొద్ది రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు తొలి షో నుంచే మంచి టాక్ లభించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది.
ఇప్పటికే రెండు రోజుల బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.28 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మధ్యకాలంలో మంచి క్రేజ్ ఉన్న కొంతమంది హీరోల సినిమాలకు కూడా ఇలాంటి వసూళ్లు రావడం లేదు. అలాంటిది సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఈ స్థాయి కలెక్షన్లు రావడంతో ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. నేడు సెలవు రోజు కావడంతో ఈ సినిమాకు మరింత మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయనే అంశంపైనే ఈ సినిమా హిట్ రేంజ్ ఆధారపడి ఉంది. మరి 'మా ఇంటి బంగారం'తో సమంత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






