ఏపీలో మరో ముప్పై ఏళ్ల అధికారంపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఏపీలో మరో 30 ఏళ్లు కూటమి ప్రభుత్వమే ఉండాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లుగా కేంద్రం సాయంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా అభివృద్ధి పనులు చేపట్టిందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు...

ఏపీలో మరో ముప్పై ఏళ్ల అధికారంపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో మరో 30 ఏళ్లు కూటమి ప్రభుత్వమే ఉండాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minsiter Rammohan Naidu) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లుగా కేంద్రం సాయంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా అభివృద్ధి పనులు చేపట్టిందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రెండేళ్ల కూటమి పాలనపై తాను చర్చ సిద్ధమని వైసీపీ(Ycp) నాయకులకు సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో ప్రతి రోజూ ఏదో ఒక వార్త వినాల్సి వచ్చేందని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా(Guntur District)లోనే రాజకీయం పుట్టిందని అంటారని, కానీ అక్కడ రాజకీయాలు చేయాలంటూ పీహెచ్‌డీ చేయాలన్నారు. ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారని, మరో ముప్పై ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని కేంద్రమంత్రి రామ్మోహనాయుడు ఆకాంక్షించారు.

Next Story