రాష్ట్రంలో వరుస విషాదాలు.. ప్రేమికులు సహా ఐదుగురు మృతి

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. ఓ ప్రాంతంలో కౌలు రైతు, మరో ప్రాంతంలో బాలుడు కరెంట్ షాకుతో మృతి చెందారు.

రాష్ట్రంలో వరుస విషాదాలు.. ప్రేమికులు సహా ఐదుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. ఓ ప్రాంతంలో కౌలు రైతు, మరో ప్రాంతంలో బాలుడు కరెంట్ షాకుతో మృతి చెందారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గంగులకుంట వద్ద ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. రైలు కిందపడి యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ధర్మవరం రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పరిగి మండలం వంగలపల్లి గ్రామంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి మల్లికార్జున (40) అనే కౌలురైతు మరణించాడు. పొలంలో కంది విత్తనసాగు చేస్తుండగా.. ట్రాక్టర్ కు విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి స్వస్థలం రొద్దం మండలం రొద్దకంపల్లిగా గుర్తించారు.

విజయనగరం జిల్లా బక్కునాయుడుపేట కస్తూర్భా స్కూల్లో 9వ తరగతి విద్యార్థిని అయిన బిందు తీవ్రమైన కడుపునొప్పితో అకస్మాత్తుగా మరణించింది. తోటి విద్యార్థులు నీళ్లు తాగించగా.. నోటి నుంచి నురగ రావడంతో.. వెంటనే వేపాడ పీహెచ్ సీ కి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. విద్యార్థిని మృతదేహాన్ని స్వస్థలమైన జాకేరుకు తరలించగా.. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

విశాఖలోని మధురవాడలో మరో విషాదం నెలకొంది. కరెంట్ షాకుతో ఆరేళ్ల బాలుడు మృతి చెందారు. సాయిరాం కాలనీలో బాలుడు ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ కు గురయ్యాడు. అఖిల్ (6) అనే బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Next Story