- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5G Users: ఆరేళ్లలో మూడు రెట్లు పెరగనున్న 5జీ యూజర్లు
ఇదే సమయంలో 4జీ ఆధిపత్యం క్రమంగా తగ్గనుంది. ప్రస్తుతం 57 కోట్లుగా ఉన్న 4జీ యూజర్లు 2031 నాటికి 16 కోట్లకు పడిపోతారని ఎరిక్సన్ అంచనా వేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో 5జీ విప్లవం మరింత వేగం అందుకుంటోంది. తాజా ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం, 2031 నాటికి దేశంలో 5జీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగి 110 కోట్లను దాటనుంది. ఇది మొత్తం మొబైల్ కనెక్షన్లలో 81 శాతం వాటాకు సమానం. ప్రస్తుతం 2025 చివరి నాటికి భారత్‌లో 43 కోట్ల 5జీ యూజర్లు చౌక ధరల్లో లభిస్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్‌లు, దాదాపు అన్ని జిల్లాలకు విస్తరిస్తున్న నెట్‌వర్క్ కవరేజ్, అలాగే 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ సేవల విస్తరణ ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో 4జీ ఆధిపత్యం క్రమంగా తగ్గనుంది. ప్రస్తుతం 57 కోట్లుగా ఉన్న 4జీ యూజర్లు 2031 నాటికి 16 కోట్లకు పడిపోతారని ఎరిక్సన్ అంచనా వేసింది. మొబైల్ డేటా వినియోగంలో కూడా మనదేశం ప్రపంచస్థాయిలో అగ్రస్థానంలో కొనసాగనుంది. ప్రస్తుతం ఒక్కో స్మార్ట్‌ఫోన్ వినియోగదారు నెలకు సగటున 37 జీబీ డేటా వినియోగిస్తుండగా, 2031 నాటికి అది 70 జీబీకి చేరుతుందని నివేదిక పేర్కొంది. ఎరిక్సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ బన్సల్ ప్రకారం, 5జీ విస్తరణ దేశ డిజిటల్ ఎకోసిస్టమ్‌ను వేగంగా మారుస్తోంది. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత సేవల విస్తరణతో మొబైల్ నెట్‌వర్క్‌లు ఇక కేవలం కనెక్టివిటీ సాధనాలుగానే కాకుండా, ఆర్థిక కార్యకలాపాలు, డిజిటల్ సేవలు, ఆవిష్కరణలకు కీలక మౌలిక సదుపాయాలుగా మారుతున్నాయని ఎరిక్సన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎరిక్ ఎకుడెన్ తెలిపారు.






