' రైల్వే బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలి '

by Batti.Sumithra |

ఘట్కేసర్ పట్టణంలో పెండింగ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని ఘట్కేసర్ పట్టణ ప్రజలు డిమాండ్ చేశారు.

 రైల్వే బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలి
X

దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్ పట్టణంలో పెండింగ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని ఘట్కేసర్ పట్టణ ప్రజలు డిమాండ్ చేశారు. ఆదివారం రాజకీయాలకు అతీతంగా ఘట్కేసర్ పట్టణ ప్రజలు నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి ఆవరణలో సమావేశం ఏర్పాటు చేసి బ్రిడ్జి అభివృద్ధి పనుల పై చర్చించారు. గత రెండు సంవత్సరాల నుండి స్థానిక ప్రజలు పోరాటం చేసి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి దాదాపు రూ. 3 కోట్ల వరకు కాంట్రాక్టర్ కు ఇప్పించారని, బిల్లు తీసుకున్న కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జి పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని, లేకపోతే రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆధ్వర్యంలో వివిధ రకాల నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

వరంగల్ హైవే దిగ్బంధం, అధికార కార్యక్రమాలను బైకాట్ చేయడం, ఎన్నికలు బైకాట్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఆర్ అండ్ బీ అధికారులు వెంటనే బ్రిడ్జి పనులను పర్యవేక్షించి మిగిలిన పనులను వేగవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఘట్కేసర్ మండల మాజీ ఎంపీటీసీ నందం గణేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బర్ల ఆంజనేయులు, అంకం సురేష్, బండ్లగూడెం కిషోర్, ఖలీల్, వీరేష్, ఘట్కేసర్ గ్రామ యువకులు దీపక్, సలీం, ఉదయ్, శివ, విద్యార్థి సంఘం నాయకులు ఏబీవీపీ నాయకుడు శ్యామ్ కిరణ్, సీనియర్ న్యాయవాదులు రాఘవరెడ్డి, సురేష్ కుమార్, జేఏసీ నాయకులు మారం లక్ష్మారెడ్డి, బచ్చు నాగేష్ నాగేష్, ప్రమోద్ గుప్తా, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి మాజీ ఎంపీటీసీ నర్సింగ్ రావు, మజీద్ కమిటీ అధ్యక్షుడు అన్నూభాయ్, కుల సంఘాల పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

Next Story